TGUGCET-2022 తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ మహిళ, ట్రైబల్ వెల్ఫేర్( మహిళలు, పురుషులు )రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టి యూ జి సెట్ 2022) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 2022- 2023 విద్యా సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో బిఎ బికాం బి ఎస్ సి బి బి ఏ తదితర కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు అర్హత కలిగిన జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు: మే 2022 లో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు కు హాజరు కానున్న విద్యార్థులు దరఖాస్తు అర్హులు అవుతారు మీరు కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ప్రవేశం లభిస్తుంది అలాగే 2021 మార్చ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2) విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించి ఉండకూడదు. 3) పురుషుల కాలేజీలో అడ్మిషన్స్ కు పురుషులు మహిళల కళాశాలలో ప్రవేశాలకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, పరీక్ష విధానం: Tg ug సెట్ పరీక్ష ప్రశ్నపత్రం మొత్తం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. మొత్తం ఐదు గ్రూపులకు (ఎంపీసీ, బైపీసీ, సీఈసీ,, హెచ్ ఈ సి )కి సంబంధించిన పరీక్ష జరుగుతుంది .ప్రతి గ్రూప్ పరీక్షలు 4 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్క సబ్జెక్టు 30 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అడుగుతారు .పరీక్షా సమయం రెండున్నర గంటలు. ఎంపిక ప్రక్రియ: Tg ug సెట్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ముఖ్యమైన సమాచారం: దరఖాస్తుకు చివరి తేదీ:10-01-2022 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. Website:www.tswreis.ac.in/

Website:www.tswreis.ac.in/

 577 total views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *