విద్యకు బ్యాంకు రుణం పొందడం ఎలా?

విద్యా రుణానికి సిద్ధం అవ్వండి ఇలా
దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకుంటున్న వారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.స్వదేశం విదేశం ఎక్కడైనా సరే ఉన్నత విద్య ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఇదే క్రమంలో బ్యాంకులను విద్యా రుణాల కోసం సంప్రదించడం ప్రారంభించాలి.
విద్యారుణం ఎవరికి ఇస్తారు:
గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదవడానికి సిద్ధమవుతున్న 18-25 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులు ఈ రుణాలను పొందడానికి అర్హులు. విశ్వవిద్యాలయాల్లో చదివే వారు కాకుండా గుర్తింపు పొందిన నైపుణ్యాల శిక్షణ కోసం ఈ రుణాలు తీసుకోవచ్చు. విద్యార్థులకు ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి వారి తల్లిదండ్రులు సంరక్షకులు రుణానికి సహ దరఖాస్తు దారులు ఉంటారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఉద్యోగంలో చేరిన వెంటనే రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించకపోతే వారికి నామిని ఎవరు ఉంటారో వారు చెల్లించాల్సి ఉంటుంది.
ఎందుకోసం ఇస్తారు:
కోర్సుకు అయ్యే ట్యూషన్ ఫీజు, పుస్తకాల ఖర్చు, ల్యాబ్ లైబ్రరీ ఫీజులు, లాప్టాప్ కొనుగోలు తదితర అన్ని విద్యారుణం పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు హాస్టల్ ఖర్చులను రుణం లో భాగంగా తీసుకోవచ్చు. రుణం వేల నుంచి కోటి వరకు తీసుకునే వీలుంటుంది. కానీ విద్యార్థికి రుణం పొందేందుకు తగిన అర్హత ఉండాలి. ఆదాయం వివరాలు పన్ను చెల్లింపు, రిటర్నులు ఆస్తులు, క్రెడిట్ స్కోర్ ఇందుకు ప్రామాణికంగా తీసుకొంటాయి బ్యాంకులు.
హామీ అవసరమే నా :
సాధారణంగా బ్యాంకులు 7-5 లక్షల వరకు విద్యా రుణాన్ని ఎలాంటి హామీ లు అవసరం లేకుండా అందిస్తాయి. అంటే బ్యాంకుకు మీరు ఏ విధమైన పేపర్( తనకా) చూపించాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ కావాలి అంటే మాత్రం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు,హామీ చూపించాల్సిందిగా అడుగుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది….
విద్యార్థులు ఐ ఐ టి, ఐ ఐ యమ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరినప్పుడు 40 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేని రుణాలను బ్యాంకులు అందించేందుకు ముందుకు వస్తాయి,
15 ఏళ్ల వరకు:
విద్యా రుణాన్ని 15 ఏళ్ల వరకు తీర్చేందుకు వీలుంటుంది. విద్యార్థులకు సంవత్సరం పాటు మారటోరియం సౌకర్యం ఉంటుంది. మారటోరియం ని కొన్నిసార్లు పెంచే అవకాశం ఉంటుంది. మారటోరియం వీలైనంత తక్కువగా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే రుణ వాయిదాలను చెల్లించడం మేలు.
పన్ను (Tax) ప్రయోజనాలు:
విద్యా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించిన తర్వాత వడ్డీ మొత్తానికి ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80 ఈ ప్రకారం పూర్తి మినహాయింపు లభిస్తుంది ఇలా ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఎలాంటి పరిమితులు లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్నప్పుడే ఈ సెక్షన్ వర్తిస్తుంది. సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే, హామీ ఇచ్చిన ఆస్తులను బ్యాంకు జప్తు చేయడం, క్రెడిట్ స్కోర్ పై ప్రభావం ఇలాంటి ప్రతికూలతలు ఉంటాయి, భవిష్యత్తులో కొత్త రుణాలు అవసరం అయినప్పుడు అంత తేలికగా దొరకక పోవచ్చు.

పూర్తి వివరాలకోసం వీడియో చూడాలి అనుకునే వారు Model Ideas YouTube Channel లాగిన్ అవ్వండి

 526 total views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *