బి సి జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు 25న పరీక్ష: మన తెలంగాణ రాష్ట్రంలోని బి సి జూనియర్ కళాశాలలు, మహిళ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బిసి గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. కరోనా నిబంధనల ఈ మేరకు ప్రవేశ పరీక్ష నిర్వహణ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు 41,110 మంది, మహిళా డిగ్రీ కళాశాలలో సీట్లకు5, 367 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు435 మంది దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
ఉపకార వేతనం దరఖాస్తుకు మరోసారి అవకాశం: కరోనా కారణంగా రాష్ట్రంలో 2020ఫీజుల-21 సంవత్సరానికి బోధనా ఫీజులు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోలేకపోయినా విద్యార్థులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించింది.
491 total views