
తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది పరీక్ష కూడా రాశారు. సెలెక్ట్ అయిన 1940 మంది అభ్యర్థులను ఫిజికల్ వాకింగ్ టెస్ట్ కు పిలువగా 717 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. 78 అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు. 1145 అభ్యర్థులు ఆబ్సెంట్ అయ్యారు. వీరి స్థానంలో కొత్తగా 1223 మంది అభ్యర్థులు పరీక్ష రాసి పాస్ అయిన వారిని కొత్తగా వాకింగ్ టెస్ట్ కు అర్హత సాధించారు. వీరికి సంబంధించిన హాల్టికెట్ నెంబర్లను TSPSC వెబ్సైట్(www.tspsc.gov.in) లో పొందుపరిచారు. మీ హాల్టికెట్ నెంబర్ గనుక ఈ సెలెక్ట్ లిస్ట్ లో ఉంటే మీరు వాకింగ్ టెస్ట్ కి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళ్ళవలసి ఉంటుంది.

త్వరలోనే ఫిజికల్ టెస్ట్ వివరాలు, తేదీలను ప్రకటిస్తామని TSPSC తెలియజేసింది. ఫిజికల్ టెస్ట్ 4 గంటలలో 16 కిలోమీటర్లు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని జిరాక్సులు తీసుకొని సిద్ధంగా ఉండాలని టిఎస్పిఎస్సి తెలియజేసింది.
1,513 total views