తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు.
కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయి. మొదటి సంవత్సరం ఆయా సబ్జెక్టులో వచ్చిన మార్కులను రెండో సంవత్సరంలోనూ కేటాయించారు. ఫస్ట్ ఇయర్ మార్కులను డబల్ చేసి సెకండ్ ఇయర్ కు కలుపుతున్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో వంద శాతం మార్కులను కేటాయించారు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 మార్కులను ఇచ్చారు. మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన సేమ్ సబ్జెక్టుకు సెకండియర్ లో కూడా 35 కలుపుతారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరం సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు పూర్తి చేశారు.
రిజల్ట్స్ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
2,433 total views