దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్ లో ప్రవేశానికి నిర్వహించే “ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ 2021” నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి లో ప్రవేశం కల్పించబడుతుంది. ఇంగ్లీష్ మీడియం లో విద్యను అందిస్తూ త్రివిధ దళాల్లో ఉద్యోగం అందించడమేే లక్ష్యంగా సైనిక్ స్కూల్స్ పనిచేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు స్కూళ్లకు ప్రవేశం కల్పిస్తారు. అవి కోరుకొండ స్కూల్ విజయనగరం జిల్లా, కలికిరి సైనిక్ స్కూల్ చిత్తూరు జిల్లా.
దరఖాస్తు సమాచారం
దరఖాస్తు ఫీజు: 500 రూ.( ఎస్సీ ,ఎస్టీలకు 400.రూ)
ఏ ఐ ఓ ఎస్ ఎస్ ఈ ఈ-2021 తేదీ2021 జనవరి10
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్19.
పరీక్షా విధానం
పెన్ను పేపరు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు
ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో ఐదో తరగతి స్థాయిలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంటెలిజెంట్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షల్లో ఎనిమిదో తరగతి స్థాయిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ ,ఇంటలిజెన్స్ ,జనరల్ నాలెడ్జ్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
అర్హత వివరాలు
ఆరో తరగతి లో ప్రవేశానికి విద్యార్ధి వయస్సు 2021 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పాసై ఉండాలి.
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండాలి గుర్తింపు పొందిన పాఠశాలలో నుంచి 8వ తరగతి పాస్ అయి ఉండాలి.
ఆన్లైన్ అప్లై కొరకు ఈ క్రింది లింక్ ను చూడండి:
1,195 total views